జాతీయ అవార్డులపై టాలీవుడ్ అసంతృప్తి!
హైదరాబాద్: శనివారం ప్రకటించిన 50వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమా రంగానికి ఒక్కటి రాకపోవడం పట్ల తెలుగు సినిమా పరిశ్రమ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జ్యూరీ సభ్యుల్లో తెలుగు వారి ప్రాతినిధ్యం సరిగా లేకపోవడం వల్లే మనకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆదివారం ఉదయం సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు మాట్లాడుతూ..కనీసం ప్రాంతీయ ఉత్తమ చిత్రమైన ప్రకటించి ఉండాల్సింది. ఇది పక్షపాత ధోరణేఅని వ్యాఖ్యానించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు లాబీయింగ్ వల్లే ఇతర ప్రాంత చిత్రరంగాలకు అవార్డులు పోతున్నాయిని అభిప్రాయపడ్డారు.
ఆడలేక మద్దెల..?
అయితే, గత ఏడాది తెలుగు చిత్రరంగం నిజంగా అవార్డు స్థాయిలో చిత్రాలు తీసిందా అని ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఈ సారి అవార్డులు పొందిన చిత్రాల్లో ప్రధానమైనవాటితో - మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, దేవదాస్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, కన్నాత్తిల్ ముదమిట్టాల్ (అమృత)- పోల్చితే...తెలుగు సినిమా ఒక్కటీ కూడా వాటి దరిదాపుల్లోకి రాదన్నది నిజం. పూర్తి కమర్షియలిజంలో కొట్టుమిట్టాడుతోన్న తెలుగు చిత్రరంగానికి అవార్డులపై విమర్శించే హక్కు లేదన్నది కఠోర సత్యం.












Click it and Unblock the Notifications