తెలంగాణలో బోనాల సంబరాలు
హైదరాబాద్: ఆషాఢ మాసంలో తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగే బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆదివారం అంతా బోనాల సంబరాలే. పాతబస్తీలోని అక్కన్న, మాదన్న ఆలయంలో ఉదయం నుంచి బోనాలు మొదలు అయ్యాయి.
ఆడపడుచులు పట్టుచీరలు కట్టుకొని, నెత్తిన బోనాలతో దేవాలయాలను సందర్శించుకోవడంతో నగరం అంతా కళకళలాడింది. జూబిలీహిల్స్ లోని పెద్దమ్మ గుడి, సికింద్రాబాద్ లోని అమ్మవారుల దేవాళయాలు బోనాల సమర్పించుకునే భక్తులతో కిటకిటలాడాయి.
బోనాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇతర మతస్థులు పాతబస్తీలో బోనాలను సమర్పించుకోవడం విశేషం. పోలీసులు భారీ ఎత్తున బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎనిమిది రోజులు పాటు తెలంగాణలో ఈ ఉత్సవాలు కొనసాగుతాయి.












Click it and Unblock the Notifications