పార్లమెంట్ లో కర్ణాటకపై నిలదీయండి
హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కర్ణాటక అక్రమంగా చేపట్టిన ప్రాజెక్ట్ లపై మరింత గట్టిగా నిలదీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు తెలియచేశారు. వీలైతే సోమవారం పార్టీకి చెందిన 29 మంది ఎంపీలు సమావేశమయ్యి వ్యూహాన్ని ఖారారు చేసుకోవాలని టీడీపీపీ నాయకుడు ఎర్నన్నాయడికి ఆయన విస్థూచించారు.
పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశం గురించి చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు ఈ విధంగా పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక అక్రమంగా చేపడుతోన్న ప్రాజెక్ట్ ల వల్లే రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతోన్నాయన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి వెళ్ళి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యి వ్యూహాన్ని
ఖరారు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications