సంజయ్, మాల్యకు తప్పిన ప్రమాదం
జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, సినిమా నటుడు సంజయ్ ఖాన్ తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వీరు ఇరువురూ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ కర్ణాటకలోని బగాళ్ కోట హెలిప్యాడ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది.
బలమైన గాలలు వీస్తుండడంతో హెలికాప్టర్ అదుపుతప్పి హెలిప్యాడ్ వద్ద ప్రమాదానికి గురి అయింది. హెలికాప్టర్ రెండు ముక్కలుగా ధ్వంసమైంది. 100 అడుగల ఎత్తు నుంచి ఢీకొన్నా ప్రయాణీకులు సురక్షితంగా బయపడడం అదృష్టంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదే హెలికాప్టర్ లో ప్రయాణిస్తోన్న ఎన్ డిటీవీకి చెందిన జర్నలిస్ట్ తుషితా పటేల్, కెమెరామ్యాన్ ఆజ్మల్ జేన్ స్వల్పంగా గాయపడ్డారు. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి కార్యకర్తలకు వివరించేందుకు ఆయన బగాళ్ కోట వచ్చారు.












Click it and Unblock the Notifications