కాంగ్రెస్‌ సిఎం అభ్యర్ధి ఎవరు?బిజెపి

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 31-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

కాంగ్రెస్‌ సిఎం అభ్యర్ధి ఎవరు?బిజెపి

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి అభ్యర్ధిఎవరో కాంగ్రెస్‌ ప్రకటించాలని బిజెపి రాష్ట్ర శాఖమరోసారి డిమాండ్‌ చేసింది. బస్సు యాత్రఉద్దేశమేమిటో కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు స్పష్టంచేయాలని రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌శేషగిరిరావు, ముషిరాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మణ్‌కోరారు. శనివారం బిజెపి కార్యాలయంలో వారు విలేకరులసమావేశంలో ప్రసంగించారు.

ముఖ్యమంత్రి అభ్యర్ధిఎవరో ప్రకటిస్తే సగం మంది బస్సు దిగిపోతారనివారు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రణాళిక ఎంత ముఖ్యమో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కూడా అంతముఖ్యమని వారు అన్నారు. తాము ఐక్యంగా ఉన్నామనిచాటుకోడానికి మాత్రమే కాంగ్రెస్‌ నాయకులుబస్సు యాత్ర నిర్వహించదలచుకొంటే అది వృధా అని, ఐక్యతాచర్చలు గాంధీ భవన్‌ లో చేసుకోవచ్చనివారు పేర్కొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X