కాంగ్రెస్ పొత్తులపై దేశంవిమర్శ
Posted on 17-11-03
హైదరాబాద్: వామపక్షాలతో కాంగ్రెస్ ఏ ప్రాతిపదికపై పొత్తుకు సిద్ధపడుతుందోఅర్థం కావడం లేదని తెలుగుదేశం వ్యాఖ్యానించింది. సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ వివిధ పార్టీలతో పొత్తులకు సిద్ధపడుతోందని తెలుగుదేశం అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్ రెడ్డి సోమవారంవిలేకరుల సమావేశంలో విమర్శించారు.
మజ్లీస్, వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితులతో కాంగ్రెస్ సిద్ధాంతాలను పక్కన పెట్టి పొత్తులకు సిద్ధపడుతోందని, పొత్తుల విషయంలో కాంగ్రెస్‌కు విధానం గానీ, స్పష్టత గానీ లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని ఓడించే ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ అధికారం కోసం పొత్తులకు సిద్ధపడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే కాంగ్రెస్ డిమాండ్ అర్థం లేనిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
