నాలుగు రాష్ట్రాల్లో 55 శాతం పోలింగ్‌

కోల్‌కత్తా: ప్రధాని అటల్‌ బిహారీపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ లేఖాస్త్రం సంధించారు. తనను సంప్రదించకుండా తమ పార్లమెంటు సభ్యుడు సుదీప్‌ బందోపాధ్యాయను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయంపై ఆమె ప్రధాని మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇది సంప్రదాయ విరుద్ధమని, సంకీర్ణ రాజకీయాల ప్రాథమిక ధర్మానికి వ్యతిరేకమని ఆమె అన్నారు.

ఈ మేరకు ఆమె రెండు పేజీల లేఖను ప్రధానికి ఆమె ఫ్యాక్స్‌ చేశారు. దీంతో బందోపాధ్యాయను మంత్రివర్గంలో చేర్చుకోవాలనే నిర్ణయాన్ని ప్రధాని వాయిదా వేశారు. శనివారం ఉదయమే ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వుంది. అయితే తన పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారు. సుదీప్‌ బందోపాధ్యాయను మంత్రి వర్గంలో చేర్చుకునేవిషయమై తనను ఏ దశలోనూ సంప్రదించలేదని, తన అనుమతి కూడా తీసుకోలేదని ఆమె ఆ లేఖలో చెప్పారు. ఈ మాటలు తాను ఎంతో బాధతో చెప్తున్నానని ఆమె అన్నారు.

మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలని సూచించే నిర్ణయంతో పాటు అన్నివిషయాల్లో నిర్ణయం తీసుకనే ప్రక్రియలో సంకీర్ణంలోని ప్రతి రాజకీయ పార్టీకిస్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి ఉన్నదని ఆమె గుర్తు చేశారు. మంత్రి వర్గంలో చేర్చుకునేవారి జాబితాలోంచి బందోపాధ్యాయపేరును తొలగించాలని ప్రధాని కోరుతూ తమ పార్టీ అత్యవసర వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+