తిరుమలలో వైభవంగా దీపావళి ఆస్థానం, ఈ సారి ప్రత్యేకంగా..!!

తిరుమలలో రద్దీ పెరుగుతోంది. కొద్ది రోజులుగా తగ్గముఖం పట్టిన భక్తుల రద్దీ తిరిగి క్రమేణా పెరుగుతుండటంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కాగా.. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఇక.. వచ్చే నెలలో జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి పది రోజుల నుంచి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.

తిరుమలలో దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ మలయప్పస్వామి వారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్ద గరుడాళ్వారు సన్నిధిలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర మంగళహారతులు, ప్రసాద నివేదనలు సమర్పించారు. అనంతరం మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించి, రూపాయి హారతి, ప్రత్యేక హారతులు నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగిసింది. టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, దీపావళి పర్వదినాన శ్రీవారి భక్తులతో పాటు ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులతో దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
ttd-observes-traditional-deepavali-asthanam-at-tirumala-temple-here-the-details

వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు

అదే విధంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లలు, ఆప్తులతో కలిసి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కాగా.. డిసెంబర్ 20వ తేదీ నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాల పైనా టీటీడీ నిర్ణయం తీసుకుంది. కాగా.. అధికమంది సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గత వైకుంఠ ద్వార దర్శనా ల్లో చేసిన విధంగానే తొలి మూడు రోజులకు ఆన్ లైన్ లో ఈ-డిప్ ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇక.. తర్వాతి ఏడు రోజులు సర్వ దర్శనం అమలు చేయాలని తెలిపారు. డిసెంబర్ 25వ తేది శుక్రవారం రోజున స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వ దర్శనం భక్తులకు దర్శనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+