టీడీపీ కొత్త జెడ్పీ ఛైర్మన్ల లిస్టులో- పరిటాల శ్రీరామ్, మజ్జి సిరికి బిగ్ ట్విస్ట్..!?
జెడ్పీ ఛైర్మన్ సీట్ల పైన స్పష్టత వస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 28 జెడ్పీ ఛైర్మనలలో కూటమికి 27 స్థానాలు దక్కనున్నాయి. అందులో బీజేపీకి కడప, జనసేనకు అయిదు స్థానాలు ఖాయం కాగా.. మిగిలిన 21 జెడ్పీ ఛైర్మన్ల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పదవుల కోసం టీడీపీలో ని సీనియర్ల వారసులు పోటీలో ఉన్నారు. జెడ్పీ పీఠం ఖాయమని భావించిన పరిటాల శ్రీరామ్.. మజ్జి సిరి విషయంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో.. ఎవరికి జెడ్పీ పీఠాలు చివర కు దక్కుతాయనేది ఉత్కంఠ పెంచుతోంది.
జెడ్పీటీసీ తుది ఫలితాలు ప్రకటించారు. అందులో భాగంగా కూటిమికి 27 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు దక్కనున్నాయి. కాగా... కూటమి పార్టీల సర్దుబాటులో భాగంగా కడప జెడ్పీ స్థానం బీజేపి కి వెళ్లనుంది. జనసేనకు పల్నాడు, శ్రీసత్యసాయి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు దక్కనున్నాయి. అదే విధంగా తిరుపతి జిల్లా వైస్ ఛైర్మన్ పోస్టు జనసేనకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఫలితాల్లో అల్లూరి సీతారామ రాజు జిల్లా వైసీపీ గెలుచుకుంది.

దీంతో.. జనసేనకు మరో స్థానం కేటాయిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక.. ఈ సారి వారసులు పెద్ద సంఖ్యలో జెడ్పీ ఛైర్మన్ స్థానాల కోసం పోటీలో ఉన్నారు. వారి లో పరిటాల శ్రీరామ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసి సుమారు 4,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, సత్యసాయి జిల్లా జెడ్పీ పీఠం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. చివరి నిమిషంలో టీడీపీకి సత్యసాయి జిల్లా దక్కితే మినహా పరిటాల శ్రీరామ్ కు అవకాశం కనిపించటం లేదు.
అదే విధంగా విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ రేసులో మజ్జి శ్రీను కుమార్తె మజ్జి సిరిసహస్ర ఉన్నారు. ఆమె తెర్లాం నుంచి జెడ్పీటీసీగా విజయంసాధించారు. అయితే ఆమె కులధ్రువీకరణ పత్రం విషయంలో వివాదం ఉంది. అలాగే టీడీపీ నేత కర్రోతు బంగార్రాజు కుమార్తె కర్రోతు చంద్రకళ కూడా రేసులో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి జెడ్పీ పీఠం ఖరారు కానుంది. ఏలూరు జడ్పీ చైర్మన్ రేసులో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్య కు దాదాపు ఖాయమని చెబుతున్నారు.
తిరుపతి జెడ్పీ ఛైర్‌పర్సన్ పదవికి కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి కుమార్తె డాక్టర్ చేతన ప్రముఖంగా రేసులో ఉన్నారు. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్మన్ కేసులో విక్కుర్తి శ్రీనివాసరావు భార్య జయలక్ష్మి ఉన్నారు. నంద్యాల జిల్లా జెడ్పీ ఛైర్మన్ రేసులో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సోదరుడు రాజారెడ్డి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జెడ్పీ ఛైర్మన్ రేసులో గొల్లపల్లి అమూల్య, పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ ఛైర్మన్ రేసులో టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
