ముంచుకొస్తున్న మరో అల్పపీడనం, మళ్లీ భారీ వర్షాలు- ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, యానాంతో పాటు తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో.. ఈ వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంటుందని అంచనా వేస్తున్నారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే విధంగా అక్కడక్కడ పిడుగులు, గాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. మరోవైపు, తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి.

వైసీపీకి దక్కేది ఈ ఒక్క జిల్లా జెడ్పీ పీఠం, లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్..!!
వైసీపీకి దక్కేది ఈ ఒక్క జిల్లా జెడ్పీ పీఠం, లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్..!!
imd-predicts-low-pressure-area-in-bay-of-bengal-on-november-13-rain-alert-for-ap-and-telangana

తాజా హెచ్చరికలతో అప్రమత్తం

అదే విధంగా రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్ వంటి శివారు ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు ఎక్కువగా కనిపిస్తోంది. సాయంత్రం 5:30 తర్వాత చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కన్నా 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. తాజా అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీయొచ్చు. తెలంగాణలోనూ అక్కడక్కడా తేలికపాటి జల్లులతో పాటుగా సోమవారం తర్వాత వాతావరణం పొడిగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+