ఫైనల్ ఫలితాలు: అంచనాలు తారుమారు - పెనుమార్పు..!!

ఏపీలో స్థానిక ఎన్నికలు కొత్త రాజకీయానికి కారణమయ్యాయి. తుది ఫలితాలు వెల్లడయ్యాయి. మున్సిపల్ ఫలితాలకు భిన్నంగా గ్రామీణ రిజల్ట్ కనిపిస్తోంది. హోరా హోరీగా సాగిన పోరులో ఈ ఫలితాలు మొత్తం లెక్కలనే మార్చేసాయి. గ్రామీణ ప్రాంతంలో వైసీపీ పట్టు నిలుపుకున్నట్లు కనిపిస్తోంది. కూటమి మెజార్టీ స్థానాలు దక్కించుకున్నా.. వైసీపీకి వచ్చిన సీట్లే ఇప్పుడు ఆసక్తిగా మారాయి. దీంతో.. అసలు ఈ ఫైనల్ ఫలితాలు తేల్చిందేంటి అనేది ఉత్కంఠ పెంచుతోంది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై ఎస్‌ఈసీ అధికారిక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా టీడీపీ 406, జనసేన 73, బీజేపీ 20, వైసీపీ 76, సీపీఎం 1, స్వతంత్రులు 6 చోట్ల గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా 7,768 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా టీడీపీ 4,806, జనసేన 938, బీజేపీ 117, వైసీపీ 1,711, సీపీఐఎం 15 చోట్ల గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లు పోలింగ్ లేకుండానే తేలిపోయాయి. 77 జడ్పీటీసీలు, 2,051 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఇవి దాదాపు అన్నీ కూటమి ఖాతాలోకే వెళ్లాయి. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసి.. ఏకంగా 392 ఎంపీటీసీ స్థానాలను గెలుచు కుంది. అయితే.. ఏలూరు జిల్లాలో వైసీపీ అత్యధికంగా 107 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధిం చింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో చీరాల లో మాత్రం ప్రభావం చూపింది.

వైసీపీకి దక్కేది ఈ ఒక్క జిల్లా జెడ్పీ పీఠం, లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్..!!
వైసీపీకి దక్కేది ఈ ఒక్క జిల్లా జెడ్పీ పీఠం, లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్..!!
ap-local-body-election-results-reveal-strength-of-alliance-and-ysrcp-here-the-detailed-report

ఫలితాల పై భిన్నాభిప్రాయాలు

కాగా.. మొత్తం 29 జిల్లా పరిషత్ స్థానాల్లో కూటమికి 28 దక్కనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీకి దక్కుతోంది. అయితే.. ఈ ఫలితాలు అటు కూటమి.. ఇటు వైసీపీకి మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయినా.. ఏకగ్రీవాలను మినిహాయిస్తే వైసీపీ అంచనాలను మించి ఫలితాలను సాధించినట్లు స్పష్టం అవుతోంది. అదే సమయంలో మున్సిపల్ ఫలితాల్లో వచ్చిన ఓట్లు.. మెజార్టీలతో పోల్చితే జెడ్పీటీసీ- ఎంపీటీసీ స్థానాల్లో కొన్ని జిల్లాల్లో కూటమి అంచనాలకు దూరంగా ఉంది. ప్రత్యేకించి గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ ప్రభావం స్పష్టం కనిపించింది. ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఘర్షణల తో తుది ఫలితాల పైన రెండు వైపులా భిన్నమైన అంచనాలు వ్యక్తం అయ్యాయి. కాగా.. ఇప్పుడు ఈ ఫలితాలతో అటు కూటమి- వైసీపీ పూర్తిగా సేఫ్ జోన్ లో లేరనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో.. 2009 ఎన్నికల వరకు రాజకీయ ఉత్కంఠ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+