ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో పొల్యూషన్ డేంజర్ బెల్స్. కాలుష్య హాట్‌స్పాట్‌గా ఆ ప్రాంతం!

హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ సంబరాల్లో కాల్చిన టపాసులు, వాహనాల పొగ, నిర్మాణ కార్యకలాపాల వల్ల గాలి నాణ్యత సూచీ 410కి పైగా నమోదైంది. ఢిల్లీతో పోటీ పడుతున్నట్టు పరిస్థితి మారింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాలు కాలుష్య హాట్‌స్పాట్‌లుగా మారి ఆందోళన కలిగిస్తున్నాయి. నవంబర్ 8 రాత్రి దీపావళి వేడుకల సమయంలో నగరవ్యాప్తంగా కాలుష్య స్థాయులు ఆకాశాన్నంటాయి.

కొన్ని ప్రాంతాల్లో AQI 500 దాటగా, సగటున 321 నుంచి 410 మధ్య కొనసాగింది. ప్రకాశ్ నగర్‌లో 828, కూకట్‌పల్లిలో 628, బిక్షాపతి నగర్‌లో 625 వంటి అత్యధిక స్థాయులు నమోదయ్యాయి. ఐటీ కారిడార్‌లోని శేరిలింగంపల్లిలో 666 వరకు చేరి డేంజర్ బెల్స్ మోగించింది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో కూడా కాలుష్యం అధికంగా ఉంది. టపాసుల నుంచి వెలువడిన పొగ ఈ పెరుగుదలకు ప్రధాన కారణం.

Hyderabad Air Pollution Crisis AQI Hits 410 IT Corridor Turns Major Hotspot be alert hyderabadis

అంతేకాకుండా, నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య, నిర్మాణ కార్యకలాపాల వల్ల, పారిశ్రామిక ఉద్గారాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యం. ఐటీ కారిడార్‌లో రోడ్ల విస్తరణ, కొత్త భవనాల నిర్మాణం కొనసాగుతుండటంతో పొల్యూషన్ పెరుగుతోంది. శీతాకాలం ప్రారంభంతో పొగమంచు కలిసి కాలుష్యం మరింత తీవ్రమైంది. పీఎం 2.5, పీఎం 10 వంటి సూక్ష్మ కణాలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యాయి.

పీఎం 2.5 సాధారణంగా 223 మైక్రోగ్రాములు, క్యూబిక్ మీటర్‌కు చేరగా, కొన్ని ప్రాంతాల్లో అంతకు మించి ఉంది. ఈ కణాలు ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయి ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులను పెంచుతాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఇప్పటికే శ్వాస సమస్యలు ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.

దీపావళి టపాసులు తాత్కాలికంగా కాలుష్యాన్ని పెంచినా, నగరంలో నిరంతరం కొనసాగుతున్న వాహనాలు, నిర్మాణాలు దీర్ఘకాలిక సమస్యగా మారాయి. గత కొన్ని నెలల్లోనూ ఐటీ కారిడార్‌లో AQI తరచూ 100-170 మధ్య ఉండేది. ఇప్పుడు దీపావళి తర్వాత అది మరింత పెరిగింది. ఈ పరిస్థితులలో బయటకు వెళ్లేటప్పుడు ఎన్-95 లేదా ఎన్-99 మాస్కులు ధరించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సొంత చెల్లినే గెంటేసిన మీరు మహిళా సంక్షేమం చేస్తారా? కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్!
సొంత చెల్లినే గెంటేసిన మీరు మహిళా సంక్షేమం చేస్తారా? కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్!

గాలి నాణ్యత మెరుగుపడే వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంగా ఇలాంటి కాలుష్యం కొనసాగితే ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. వాహనాల ఉద్గారాల నియంత్రణ, నిర్మాణ స్థలాల్లో ధూళి నియంత్రణ, గ్రీన్ వెహికల్స్ ప్రోత్సాహం, చెట్ల పెంపకం వంటి చర్యలు అవసరం. ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, కార్‌పూలింగ్ ప్రోత్సహించడం ద్వారా ఈ పొల్యూషన్ ను కాస్త కంట్రోల్ చెయ్యొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+