తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
గుంటూరు: నిషిద్ధపీపుల్స్‌వార్ నక్సలైట్లు గంటూరు జిల్లాలో ఇద్దరు మద్యం వ్యాపారులను కాల్చి చంపారు. తమ మద్యనిషేధం ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణపై గాను నక్సలైట్లు శనివారంనాడు దొడ్డిలేరు గ్రామంలో వారిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
అనంతరం నక్సలైట్లు మరో మద్యం వ్యాపారి డి. సుబ్బారావు (44) ఇంటికి వెళ్లి అతడ్ని కాల్చి చంపారు సుబ్బారావు ఒక హోటల్ కూడా నడుపుతున్నాడు. అప్రోచ్ రోడ్డుపై పెద్దయెత్తున మంతుపాతరలు పెట్టడంతో ఈ రెండు హత్యలు జరిగిన ఎనిమిది గంటల తర్వాత గానీ పోలీసులు గ్రామానికి చేరుకోలేకపోయారు. మద్యం వ్యాపారం చేయకూడదని జిల్లాలోని వ్యాపారులను గతంలో నక్సల్స్ హెచ్చరించారు. పలు మద్యం దుకాణాలపై దాడి చేసి లిక్కర్ బాటిల్స్‌ను ధ్వంసం చేశారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నక్సల్స్ ఇప్పటి వరకు నలుగురిని హత్య చేశారు.












Click it and Unblock the Notifications