విజయనగరం:విజయనగరం జిల్లా సాలూరులో పోలీసు కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పేకాట ఆడుతున్న కొంత మందిని పోలీసులు తీసికెళ్లి రూరల్ పోలీసుస్టేషన్ ముందు అర్థ నగ్నంగా నిలబెట్టారు. దీనికి ఆగ్రహించిన ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోఅప్పారావు, తవుడు అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.