గౌహతి: కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు శరద్ పవార్ సిద్ధపడడంతో ఎన్‌సిపి చీలక అనివార్యంగా మారింది. ఎన్‌సిపి నేతపి.ఎ. సంగ్మా శనివారం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సూచనప్రాయంగా ఈవిషయాన్ని చెప్పారు.
ఎన్‌సిపి స్థాపన ఉద్దేశానికి, దాని సిద్ధాంతానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడడం వల్ల పార్టీ చీలిక అనివార్యంగా మారిందని ఎన్‌సిపి నేత సంగ్మా సూచనప్రాయంగా చెప్పారు. పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినా లేదా బహిష్కరించినా వెంటనే పార్టీ చీలిపోతుందని ఆయన అన్నారు. విదేశీ సంతతికి చెందినవారు ప్రధాని పదవిని చేపట్టకూడదనే ప్రాతిపదికపై పార్టీ ఏర్పడిందని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే జాతీయతకు, దేశభక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లేనని ఆయన అన్నారు. విదేశీ సంతతి అంశాన్ని పక్కన పెట్టిన శరద్‌పవార్ ఎన్‌సిపిని వదిలేసి కాంగ్రెస్ చేరవచ్చునని ఆయన అన్నారు.