బెంగుళూర్: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజబల్‌తో గానీ, కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్‌తో గానీ తనకు సంబంధాలు లేవని స్టాంపుల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన అబ్దుల్ కరీం తెల్గీ చెప్పాడు.
భుజబల్‌తో గానీ, బేగ్‌తో గానీ తనకు సంబంధాలు లేవని, రాజకీయ కారణాల వల్ల వారిని ఇరికించారని అతను అన్నాడు. నగరం శివారులోని పరప్పన అగ్రహార జైలులో తెల్గీని ఉంచినట్లు తెల్గీ తరఫు న్యాయవాది నానయ్యవిలేకరులకు చెప్పారు.