హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమాస్తులు కూడగట్టారని ఆరోపిస్తూ, తమ ఆరోపణపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఉన్నత న్యాయస్థానం సూచన మేరకే తాము హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని పిసిసి ప్రతినిధి, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. తన ఆస్తుల విలువ 19 కోట్ల రూపాయలని 1999లో చంద్రబాబు చెప్పారని, అంతకు ముందు తన ఆస్తుల విలువ 36 వేల రూపాయలు మాత్రమేనని ప్రకటించారని వారు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆస్తుల విలువ 132 కోట్ల రూపాయల దాకా ఉంటుందని, ఇందుకు తగిన ఆధారాలున్నాయని ఆయన అన్నారు.