హైదరాబాద్: ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ ప్రధాన ఎన్నికల కమీషనర్ టి.యస్. కృష్ణమూర్తికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఎన్నికలుస్వేచ్ఛగా జరిగే వాతావరణాన్ని కల్పించాలని ఆయన కృష్ణమూర్తినికోరారు.
పెద్ద యెత్తున పోలీసు బలగాలను, పారామిలటరీ బలగాలను దింపడం వల్ల ప్రజలుస్వేచ్ఛగా ఓటేయడానికి వీలుండదని ఆయన అన్నారు. నక్సల్స్‌పేరు చెప్పి భద్రతా బలగాలను దింపడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తుపాకుల నీడ కింద ఎన్నికలుస్వేచ్ఛగా జరగవనేది తన అభిప్రాయమని ఆయన అన్నారు.