మహబూబ్‌నగర్:మహబూబ్‌నగర్ జిల్లాలోమంగళవారం తెల్లవారుజామునదోపిడీ జరిగింది. ఒక వ్యక్తి హత్యకుగురయ్యాడు. మరో ముగ్గురుగాయపడ్డారు.
పోలీసులుకథనం ప్రకారం -మంగళవారం తెల్లవారుజామునఆరుగురు దోపిడీ దొంగలుమహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకొటగ్రామంలోని గణపతిరెడ్డి అనే వ్యక్తిఇంట్లోకి ప్రవేశంచి, అతడ్నికొట్టి నగలు,నగదు దోచుకున్నారు. ఈ దాడిలోగణపతి రెడ్డి మరణించాడు.తమను ఆపడానికి ప్రయత్నించిన మరోముగ్గురిపై దోపిడీ దొంగలు దాడిచేశారు. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లోబాల్‌రెడ్డి అనే వ్యక్తి గాయపడ్డాడు.వారి దాడిలో యశోదమ్మ అనే మహిళ,శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కూడాగాయపడ్డారు. దోపిడీ దొంగలుమహారాష్ట్రకు చెందినవారనిఅనుమానిస్తున్నారు.