నీటిపారుదల టెండర్ల ఖరారుపై హైకోర్టుస్టే
హైదరాబాద్:నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్లఖరారును నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఒక కంపెనీ మూడు కన్నా ఎక్కువటెండర్లు వేయకూడదనేప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూమధకాన్ కంపెనీ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో టెండర్ల ఖరారుపైహైకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది.
రాష్ట్రంలోనినీటి పారుదల ప్రాజెక్టుల రెండవ కెటగిరీపనులకు టెండర్లు వేసే సమయంలోఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ కార్యాలయంవద్ద హడావిడి, గందరగోళంనెలకొంది. నీటి పారుదల ప్రాజెక్టులరెండవ కెటగిరీ పనుల టెండర్లవిషయంలో కంపెనీలు రింగ్‌గా ఏర్పడి ఒకనిర్ణయానికి వచ్చాయి. రెండవ కెటగిరీపనులను డెబ్బై ఏడు ప్యాకేజీలుగావిభజించారు. హంద్రీ నీవా ప్రాజెక్టుపనులకు టెండర్ వేయడానికి వచ్చినమధుకాన్ కంపెనీ ప్రతినిధినిరాయలసీమకు చెందిన ఒకశాసనసభ్యుడి కుమారుడుఅడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలువచ్చాయి. టెండర్లను కాంట్రాక్టర్లసమక్షంలో తెరిచారు.











Click it and Unblock the Notifications
