జయేంద్రఅరెస్టు వెనక అంతర్జాతీయ కుట్ర
చెన్నై:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి అరెస్టు వెనక అంతర్జాతీయకుట్ర ఉన్నదని శ్రీ కంచి కామకోటి భక్తులఫ్రంట్ కన్వీనర్ వినయగర్‌మురళి ఆరోపించారు. జయేంద్రసరస్వతికి ఉన్న మంచి పేరునుచెడగొట్టడానికి ఈ కుట్ర జరిగిందని ఆయనఆదివారం విలేకరులతోఅన్నారు.
ప్రమాదంఉన్నదని కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్‌సంస్థలు, తమిళనాడు ప్రభుత్వంహెచ్చరించడం వల్లనే జయేంద్రసరస్వతికి భద్రత కల్పించారనిఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఈ కుట్రను బయటపెట్టాలని ఆయనడిమాండ్ చేశారు. ఈ అంతర్జాతీయ కుట్రగురించి తెలిసిన మాజీ ప్రధాని వాజ్‌పేయిజయేంద్ర సరస్వతిని కాపాడటానికిచర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిశివరాజ్ పాటిల్‌ను అడిగారని ఆయనచెప్పారు. మఠం తరఫుననే తానువిలేకరులతో మాట్లాడతున్నట్లు ఆయనతెలిపారు.మఠంఆస్తిపై కన్నేసిన కొందరు రాజకీయనాయకుల హస్తం కూడాశంకరాచార్యపై కేసు బనాయించడంవెనక ఉన్నదని ఆయన ఆరోపించారు.రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్‌అరెస్టుకు వారంట్ జారీ కావడం చూస్తేజయేంద్ర సరస్వతిని కేసులో ఇరికించడంఎంత సులభమో అర్థం చేసుకోవచ్చుననిఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలసానుభూతిపరులైన కొంత మందిపోలీసు అధికారులు శంకరాచార్యనులక్ష్యంగా ఎంచుకుని పక్షపాత వైఖరిప్రదర్శించారని ఆయనవిమర్శించారు.











Click it and Unblock the Notifications
