జయేంద్రఅరెస్టు అంతర్జాతీయ కుట్ర:నరేంద్రస్వామి
వరంగల్:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి అరెస్టు వెనక అంతర్జాతీయకుట్ర ఉన్నదని శారదా పీఠాధిపతి స్వరూపనరేంద్రస్వామి విమర్శించారు.తమిళనాడు ప్రభుత్వం అంతర్జాతీయకుట్రదారులతో కుమ్మక్కయి జయేంద్రసరస్వతిని అరెస్టు చేసిందని ఆయనఆదివారం విలేకరులతో అన్నారు.
ఆధారాలుచూపకుండా జయేంద్ర సరస్వతిని అరెస్టుచేశారని ఆయన అన్నారు. జయేంద్రసరస్వతి అరెస్టుకు నిరసనగాసోమవారం తలపెట్టిన బంద్‌నువిజయవంతం చేయాలని ఆయన ప్రజలకువిజ్ఞప్తి చేశారు. బంద్ సందర్భంగాఉద్రేకాలకు పోవద్దని, ఆత్మహత్యలుచేసుకుంటామని బెదిరించవద్దనిఆయన సూచించారు. హిందూ మతంశాంతి సామరస్యాలను కోరుకుంటుందని,బంద్‌ను శాంతియుతంగావిజయవంతం చేయాలని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications