శంకరరామన్‌కుటుంబానికి ఆర్థిక సహాయం
చెన్నై:హత్యకు గురైన వరదరాజపెరుమాళ్ దేవాలయం మేనేజర్‌శంకరరామన్ కుటుంబ సభ్యులకుఐదు లక్షల రూపాయల నష్టపరిహారంప్రకటిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రిజయలలిత సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆమె శాసనసభలోతనంతట తాను ఒక ప్రకటన చేశారు.
తాముపేదరికంతో విలవిలలాడుతున్నామని,డబ్బులు లేక పిల్లలు చదువులుకొనసాగించలేకపోతున్నారనిశంకరరామన్ భార్య పద్మతెలియజేశారని జయలలిత చెప్పారు.పద్మ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునిముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఐదు లక్షలరూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీచేసినట్లు ఆమె తెలిపారు.శంకరరామన్‌ఈ ఏడాది సెప్టెంబర్ మూడవ తేదీనకాంచీపురంలోని దేవాలయ ప్రాంగణంలోహత్యకు గురయ్యారు. ఈ హత్యకేసులోనే కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి అరెస్టయ్యారు.ఇదిలావుంటే, డియంకె అధినేత కరుణానిధిజయేంద్ర సరస్వతి అరెస్టు విషయంలోమాట మార్చారు. జయేంద్ర సరస్వతినిఅరెస్టు చేసినందుకు తమిళనాడుప్రభుత్వాన్ని, పోలీసులను అభినందించినఆయన జయేంద్ర సరస్వతి అరెస్టువెనక వ్యక్తిగత కక్షసాధింపుఉన్నదని అనుమానిస్తున్నట్లుసోమవారంనాడు అన్నారు. తాముఅరెస్టును ఆహ్వానించామని, అయితే అరెస్టువెనక కొన్ని విషయాలు దాగి వున్నట్లుతమకు ఇప్పుడు తెలిసిందని,ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగతకక్ష సాధింపు కోసం ఈ అరెస్టు జరిగిందనిఅనుమానిస్తున్నామని ఆయన అన్నారు.జయలలితకు, శంకరాచార్యకుమధ్య అనేక వ్యక్తిగత విషయాలుఉన్నాయనే విషయాన్ని మరిచిపోకూడదనిఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
