తప్పంతామావోయిస్టులదే, మాది కాదు: డిజిపి
హైదరాబాద్:తమ పొరపాటునుకప్పిపుచ్చుకోవడానికి సిపి ఐ (మావోయిస్టు)నక్సలైట్లు కట్టుకథలు అల్లుతున్నారనిపోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్.ఆర్. సుకుమార వ్యాఖ్యానించారు.కరీంనగర్ ఎదురుకాల్పులపై,మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనక్సలైట్లు చేసిన దాడులపై ఆయనశుక్రవారం విలేకరుల సమావేశంలోతీవ్రంగాప్రతిస్పందించారు.
కరీంనగర్‌జిల్లా రుద్రంగి గ్రామం వద్ద పోలీసులకు,నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పంతా మావోయిస్టులదేననిఆయన ఆరోపించారు. పోలీసులు తమవిధుల నిర్వహణలో భాగంగా గ్రామానికివెళ్తున్నారని, ఆ సమయంలోనక్సలైట్లు ఆ గ్రామానికి డబ్బులుగుంజడానికి వచ్చారని, దీంతో ఇరు వర్గాలమధ్య ఎదురు కాల్పులు జరిగాయని ఆయనఅన్నారు. ఈ సంఘటనలో నక్సలైట్ల కోసంతాము గాలింపు చర్యలు చేపట్టామనిఆయన చెప్పారు. నక్సల్స్‌బలవంతంగా చందాలు వసూలుచేస్తున్నారని ఆయన ఆరోపించారు.మహబూబ్‌నగర్‌జిల్లా మల్లేశ్వరం గ్రామంలోవెంకటేశ్వర్లు అనే వ్యక్తిపైనక్సల్స్ దాడి చేసిన సంఘటనపైవిచారణకు పర్యవేక్షక కమిటీకిఅప్పగించే విషయంపై ప్రభుత్వంనిర్ణయం తీసుకుంటుందని ఆయనచెప్పారు. అంత బహిరంగంగానక్సలైట్లు దాడులు చేయడంరెచ్చగొట్టే చర్యేనని ఆయనఅభిప్రాయపడ్డారు.











Click it and Unblock the Notifications