ఎయిడ్స్‌రహిత రాష్ట్రంగా ఎపి: వైయస్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌ను ఎయిడ్స్ రహితరాష్ట్రంగా తీర్చుదిద్దుతామనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఎయిడ్స్‌నివారణ సామాజిక కార్యక్రమమని,ఇందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడంఅవసరమని ఆయన అన్నారు. ఎయిడ్స్‌నివారణ దినం సందర్బంగా జరిగినకార్యక్రమంలో ఆయన బుధవారంప్రసంగించారు.
ఏఒక్కరు ఎయిడ్స్‌వ్యాధి బారిన పడినాసమాజానికే నష్టమని ఆయన అన్నారు.ఎయిడ్స్ నియంత్రణకు ప్రభుత్వంకృతనిశ్చయంతో ఉన్నదని ఆయనచెప్పారు. ఎయిడ్స్ నివారణకు తగినచర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.ఎయిడ్స్ నివారణ చర్యల గురించి ప్రజలనుచైతన్యవంతులను చేయడానికిప్రసార మాధ్యమాల ద్వారా ప్రత్యేకకార్యక్రమాలు రూపొందిస్తామని ఆయనచెప్పారు. పాఠశాలల పిల్లలకు ఎయిడ్స్‌నివారణ చర్యలపై బోధించడానికిఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామనిఆయన చెప్పారు. పెళ్లికి ముందుఎయిడ్స్ లేదని నిర్ధారించుకోవడంతప్పేమీ కాదని ఆయన అన్నారు.రాష్ట్రవ్యాప్తంగాఎయిడ్స్ నివారణ దినం సందర్బంగావివిధ కార్యక్రమాలు జరిగాయి.











Click it and Unblock the Notifications
