ములుగుఆస్పత్రిలో కోవర్టు లక్ష్మణ్
వరంగల్:కోవర్టు లక్ష్మణ్ ములుగు ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నాడని వరంగల్‌జిల్లా పోలీసు అధికారులు చెప్పారు. అతనుఐదు రోజుల పాటు ఆదివాసీ లిబరేషన్ టైగర్స్‌చెరలో ఉన్నాడు. ఇతని ఉదంతం చిలికి చిలికిగాలివానగా మారింది. గతంలోవరంగల్ జిల్లాలో లక్ష్మణ్‌పీపుల్స్‌వార్ నక్సలైట్లపై (ప్రస్తుతమావోయిస్టులపై) కాల్పులు జరిపి వచ్చిపోలీసులకు లొంగిపోయాడు. తిరిగి అతనుమళ్లీ అడవిలోకి వెళ్లాడు. దీంతోనక్సలైట్లు అతడిని నిర్బంధించారు.ఇతని వ్యవహారం మావోయిస్టులకు,ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ మధ్య కూడావివాదానికి దారి తీసింది.
ఆదివాసీలిబరేషన్ టైగర్స్ చెర నుంచితప్పించుకుని అతనుమంగళవారం ఉదయం ములుగుపోలీసు స్టేషన్‌కు వచ్చాడు. ఎస్‌పికొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అతన్ని ఓయస్‌డిలేళ్ల రంగారావుకు అప్పగించారు.నక్సలైట్ల కాల్పుల్లో లక్ష్మణ్‌గాయపడ్డాడని, ప్రస్తుతం ములుగుఅస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసుఅధికారులు చెబుతున్నారు. ఆదివాసీలిబరేషన్ టైగర్స్ నుంచి తానుతప్పించుకోవడానికి ప్రయత్నించానని,తాను పారిపోయి వస్తుండగా వెనకనుంచి కాల్పులు జరిపారని లక్ష్మణ్‌చెబుతున్నట్లు వారు తెలిపారు.ఇదిలావుంటే, వరంగల్ పోలీసులువరంగల్ జిల్లా హసన్‌పర్తిమండలంలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారినుంచి పేలుగు పదార్థాల తయారీకిఉపయోగించే పదార్థాలను స్వాధీనంచేసుకున్నారు. నక్సల్స్‌మందుపాతరలు తయారుచేసుకోవడానికి వీరు వాటినిచేరవేయడానికి తీసుకెళ్లుతుండగాతమకు చిక్కారని పోలీసు అధికారులుఅంటున్నారు.











Click it and Unblock the Notifications
