ఉష ఇంటికిజయేంద్ర వచ్చేవారు
హైదరాబాద్:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతికి, శ్రీరంగం ఉషకు మధ్యగల సంబంధాలపై మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. ఉష ఇంటికి జయేంద్ర సరస్వతితరుచూ వచ్చివెళ్లేవారంటు నిర్ధారించేఒక వార్తా కథనాన్ని ఒక తెలుగుప్రైవేట్ టీవీ ఛానల్ బుధవారంనాడుప్రసారం చేసింది. ఉష చెప్పే వాటిలో పూర్తినిజాలు లేవని ఈ వార్తా కథనంతెలియజేస్తోంది.
శంకర్‌రామన్ హత్య కేసులో అరెస్టయినజయేంద్ర సరస్వతితో తరుచూమాట్లాడుతూ ఉండేదని ఆరోపణలుఎదుర్కుంటున్న ఉష కాంచీపురం పోలీసులముందు లొంగిపోయిన విషయంతెలిసిందే. తనను భర్త పందొమ్మిదివందల తొంబై అయిదులో వదిలేశాడని,తాను వ్యాధితో బాధపడుతున్నానని,తన చికిత్స నిమిత్తం కంచి పీఠంసహాయం అందించిందని ఉష చెబుతోంది. అయితేఉష చెప్పే ఈ మాటల్లో పూర్తి నిజం లేదనితెలుస్తోంది.టీవీఛానల్ ప్రసారం చేసిన కథనంప్రకారం - ఉష, ఆమె భర్తనారాయణ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుజిల్లా కాళహస్తిలో సిమెంటు ఇటుకల తయారీకంపెనీని స్థాపించారు. దాని కోసంపందొమ్మిది వందల తొంబై ఏడులోచెన్నైలోని తమ ఇంటిని తాకట్టు పెట్టిస్టేట్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నారు.ఈ కంపెనీ ప్రారంభోత్సవానికి జయేంద్రసరస్వతి వచ్చారు. అంతేకాకుండా మరోరెండు సార్లు కూడా జయేంద్ర సరస్వతికాళహస్తిలోని శ్రీరాంనగర్‌లో గల ఉషఇంటికి వచ్చారు.సిమెంట్‌ఇటుకల ఫ్యాక్టరీ యంత్రాలను బ్యాంక్‌కుతెలియకుండా అమ్ముకున్నారు. దీంతోబ్యాంక్ రుణం వసూలుకు కోర్టులో కేసువేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులోపెండింగ్‌లో ఉంది. దీన్ని ధృవీకరించడానికిబ్యాంక్ అధికారి వివరణను టీవీ ఛానల్‌ప్రసారం చేసింది.











Click it and Unblock the Notifications
