సియంపికికట్టుబడి పని చేస్తాం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ:తమ ప్రభుత్వం కనీస ఉమ్మడిప్రణాళికకు (సియంపి) కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌కలామ్ చెప్పారు. ఆయన శుక్రవారంపార్లమెంటు ఉభయ సభనుల ఉద్దేశించిప్రసంగించారు. ప్రకృతి వైపరీత్యాలనుఎదుర్కొనేందుకు త్వరలోనే ఒకవ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయనచెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లోని, జమ్మూకాశ్మీర్‌లోని తీవ్రవాదాన్ని, నక్సలిజాన్నిఎదుర్కొనేందుకు బహుముఖ విధానాన్నిఅనుసరించనున్నట్లు చెప్పారు.అభివృద్ధికి ప్రజా కేంద్రీకృత విధానాన్నిఅనుసరిస్తామని ఆయన చెప్పారు.
ఈశాన్యరాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులనుకల్పించడానికి ప్రయత్నిస్తున్నామనిఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్యరాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి ప్రత్యేకదృష్టి పెడతామని ఆయన చెప్పారు.జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీనిఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.నక్సలిజం శాంతికి, భద్రతకుముప్పుగా పరిణమించిందని, ప్రజాసంక్షేమం కోసం ప్రజాస్వామ్యపద్ధతుల్లో ముందుకు వచ్చే అన్నివర్గాలతో ప్రభుత్వం చర్చలుజరుపుతుందని ఆయన చెప్పారు.
చర్చలద్వారా శాంతియుత వాతావరణాన్నినెలకొల్పడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని, ఇందుకు ఈశాన్య రాష్ట్రాల్లోనివివిధ గ్రూపులతో చర్చల ప్రక్రియకుశ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు.చేనేత రంగాన్ని ఆధునీకరించడానికిచర్యలు తీసుకుంటామని, చేనేతకళాకారులకు అధునాతన సాంకేతికపరిజ్ఞానాన్ని, రుణసదుపాయాన్నికల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రపతిప్రసంగంలోని ముఖ్యాంశాలు
ఈశాన్యరాష్ట్రాల్లో, గిరిజన ప్రాంతాల్లో మౌలికసదుపాయాల కల్పనకు కృషి
గిరిజనులకు ఉన్న భూమి హక్కులస్థిరీకరణకు కృషి












Click it and Unblock the Notifications
