జాతీయమహిళా సంఘం అధ్యక్షురాలిగా గిరిజావ్యాస్
న్యూఢిల్లీ:జాతీయమహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గాసీనియర్ కాంగ్రెస్ నాయకురాలు గిరిజావ్యాస్ నియమితులయ్యారు. చైర్మన్‌పదవికి గిరిజా వ్యాస్ పేరును మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోదించింది.త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటనవెలువడుతుందని అధికారవర్గాలుతెలిపాయి. పూర్ణిమా అద్వాని స్థానంలో నియమితులైనగిరిజావ్యాస్‌కు కేబినెట్ మంత్రి హోదా లభించనుంది.గత ఎన్డీయే ప్రభుత్వం నియమించిన పూర్ణిమాఅద్వాని పదవీకాలం జనవరితో ముగిసింది. కేంద్రమాజీ మంత్రిగా, రాజస్థాన్ కాంగ్రెస్ ఉప నాయకురాలిగా గతంలోపనిచేసిన గిరిజావ్యాస్ ప్రస్తుతం ఏ. ఐ. సి. సి మీడియాశాఖకుఛీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఉదయ్‌పూర్‌లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయంచెందారు. కమిషన్ చైర్‌పర్సన్‌పదవికి నటి షబానా అజ్మి, సామాజిక కార్యకర్తనఫీసా అలీ తదితరుల పేర్లుపరిశీలనకు వచ్చినా చివరికి గిరిజకే పదవి దక్కింది.












Click it and Unblock the Notifications
