సిఆర్‌పియఫ్‌ఐజి నాగరాజు ఇళ్లపై సిబిఐ దాడులు
హైదరాబాద్:సిఆర్‌పియఫ్‌ఐజి నాగరాజు ఇళ్లపై కేంద్ర దర్యాప్తుసంస్థ (సిబిఐ) అధికారులు శుక్రవారందాడులు చేశారు. హైదరాబాద్‌లోనిబంజారాహిల్స్, జూబిలీహిల్స్‌లలోని ఆయనఇళ్లపై వారు దాడి చేసి సోదాలునిర్వహించారు. ఢిల్లీకి చెందిన సిబిఐఉన్నతాధికారి జాకోబ్ నేతృత్వంలోనిఅధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి ఈసోదాలు జరిపినట్లు సమాచారం.
రెండులక్షల రూపాయల విలువ చేసే కలపతో సహావిలువైన డాక్యుమెంట్లను సిబిఐ అధికారులుస్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.మణిపూర్ క్యాడర్‌కు చెందిననాగరాజుకు ఇటీవలి శ్రీనగర్ డిఐజిగా బదిలీఅయింది. అయితే ఆయన అక్కడికివెళ్లలేదు. సెలవు పెట్టిహైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇతరకేంద్ర ప్రభుత్వ అధికారుల ఇళ్లపైకూడా సిబిఐ అధికారులు దాడి చేసినట్లుతెలుస్తోంది. శుక్రవారం ఉదయంఐదున్నర గంటలకే ఈ దాడులుప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications
