ఫోర్జరీకేసులో కంచిస్వామికి ముందస్తుబెయిల్
చెన్నై:కంచి కామకోటి పీఠం రికార్డులతారుమారు కేసులో కంచిశంకరాచార్య జయేంద్ర సరస్వతికిమద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్‌మంజూరు చేసింది. కంచి మఠంలెక్కలను తారుమారు చేశారనేఆరోపణలకు సంబంధించిన కేసులో పోలీసులుతనను అరెస్టు చేయవచ్చుననేఉద్దేశ్యంతో జయేంద్ర సరస్వతిముందస్తు బెయిల్‌కు దరఖాస్తుచేసుకున్నారు.
విచారణనిమిత్తం అవసరమైనప్పుడు పోలీసులఎదుట హాజరు కావాలని జస్టిస్ ఎం.తణికాచలం జయేంద్రను ఆదేశించారు.కేసులో పటిషనర్ జయేంద్రనుచేర్చడానికి అవసరమకైనఆధారాలేవీ ప్రాసిక్యూషన్ వద్ద లేవనిజడ్జి అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే, మాధవన్‌పైహత్యాప్రయత్నం కేసులో జయేంద్రసరస్వతి పెట్టుకున్న ముందస్తుబెయిల్ పిటిషన్‌పై విచారణపదిహేడవ తేదీకి వాయిదా పడింది.ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదితో పాటుకంచి స్వామి తరఫు న్యాయవాది కూడా కేసువాయిదాకు కోర్టును కోరారు. దీంతోప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి పి.మురుగేషన్‌కేసును వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
