దళకమాండర్ సహా పదమూడు మందిలొంగుబాటు
హైదరాబాద్:రాష్ట్రంలోని రెండు జిల్లాలో శుక్రవారంపెద్ద యెత్తున నక్సల్స్ లొంగుబాట్లుజరిగాయి. కరీంనగర్ జిల్లాలో ఆరుగురునక్సలైట్లు లొంగిపోగా, వరంగల్‌జిల్లాలో ఏడుగురు లొంగిపోయారు.
సిపిఐ(యంయల్) జనశక్తిమహదేవ్‌పూర్ దళ కమాండర్‌రమాకాంత్ పాటు ఆరుగురు నక్సల్స్‌కరీంనగర్ జిల్లా పోలీసుసూపరింటిండెంట్ రాజీవ్ రతన్‌ముందు లొంగిపోయారు. ఇందులోనలుగురు జనశక్తి నక్సలైట్లు కాగా,ఇద్దరు సిపియుయస్‌ఐ నక్సలైట్లు.సిపియుయస్‌ఐ డిప్యూటీ దళకమాండర్ రాజేందర్‌తో పాటు సుశీలలొంగిపోయినవారిలో ఉన్నారు. రమాకాంత్‌ను పోలీసులు అదుపులోకితీసుకున్నట్లు, అతను పోలీసులకులొంగిపోయినట్లు రెండు రోజుల క్రితం భిన్నకథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
పార్టీలోనెలకొన్న విభేదాల వల్ల, పార్టీలో తగినప్రాధాన్యం లభించకపోవడం వల్లలొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లురమాకాంత్ చెప్పాడు.రమాకాంత్‌కు పదహారుహింసాత్మక సంఘటలతో సంబంధంఉన్నట్లు ఎస్పీ చెప్పారు.
మావోయిస్టునక్సలైట్లు ఏడుగురుశుక్రవారంనాడు వరంగల్ జిల్లాపోలీసు సూపరింటిండెంట్ స్టీఫెన్‌రవీంద్ర ముందు లొంగిపోయారు.వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌జిల్లాల్లో జరిగే హత్యలకు మావోయిస్టుకేంద్ర, రాష్ట్ర కమిటీ నాయకులతో పాటువారి ప్రతినిధులు వరవరరావు,కళ్యాణరావు కూడా బాధ్యతవహించాలని స్టీఫెన్ రవీంద్రవ్యాఖ్యానించారు. ప్రజా సంఘాల ముసుగులోనక్సల్స్ కార్యకలాపాలు సాగిస్తున్నారనిఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
