మద్యంవిధానం వల్ల నష్టమేమీ లేదు: వైయస్
హైదరాబాద్:కొత్త ఆబ్కారీ విధానం వల్ల ఎవరికీ ఏవిధమైన నష్టం లేదని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅన్నారు. బెల్ట్ షాపులను తొలగిస్తామనేహామీకి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.న్యూఢిల్లీ నుంచి ఆయన శుక్రవారంఉదయం హైదరాబాద్ తిరిగి వచ్చారు.
మద్యందుకాణాలను క్రమబద్దీకరిస్తున్నామని,అంతకు మించి కొత్తగా మద్యందుకాణాలను తెరవడం లేదనిఆయన చెప్పారు. నక్సలైట్లు హింసకుస్వస్తి చెప్పి ఆయుధాలు వీడి రాజకీయ పార్టీరూపంలో పని చేయాలని ఆయనసూచించారు.
రాష్ట్రప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచిఅమలులోకి తేనున్న నూతన ఆబ్కారీవిధానంపై అన్ని రాజకీయ పార్టీలు, అన్నివర్గాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నాయి. మిత్రపక్షాలైనవామపక్షాలు దీన్ని పూర్తిగావ్యతిరేకిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
