ఈ లాలూకుసిడిలు అవసరమా?
రాంచి: టెక్నాలజీకివ్యతిరేకి అయిన లాలూ ప్రసాద్ యాదవ్‌మరోసారి దానిపై ఎద్దేవా చేశారు.నాకుఓట్లు పడాలంటే.. సిడిల అవసరం ఉందా అని ఆర్‌జెడిఅధ్యక్షుడు, రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ప్రశ్నించారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లోమైనారిటీలు లోక్‌జనశక్తి పార్టీ వైపుమొగ్గు చూపకుండా ఉండేందుకే గుజరాత్‌ఘర్షణల దృశ్యాల సిడిలను ఆర్‌జెడి ప్రచారానికిఉపయోగిస్తోందంటూ బిజెపి చేసిన ఆరోపణలనుఆయన తీవ్రంగా ఖండించారు. గుజరాత్‌లోఅల్లర్లు జరిగాయన్నది వాస్తవం. వాటిని అప్పుడేఅందరూ టీవీలలో చూశారు అని శనివారంఇక్కడ విమానాశ్రయంలో విలేకరులతోఅన్నారు. ఆ సిడిలను ప్రచార ప్రకటనలలోనేను వాడుకున్నానా? నాకు ఓట్లు కావాలంటేసిడిల అవసరం ఉందా అని లాలూ తీవ్ర స్వరంతోఅన్నారు.












Click it and Unblock the Notifications
