గిరిజనహక్కులపై వైయస్ ప్రభుత్వం వేటు:బిజెపి
హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులనుకాలరాస్తోందని భారతీయ జనతా పార్టీ(బిజెపి) నాయకులు రాష్ట్ర గవర్నర్‌సుశీల్‌కుమార్ షిండేకు ఫిర్యాదుచేశారు. సాగు నీటి ప్రాజెక్టుల విషయంలోగిరిజన హక్కులకు భంగం వాటిల్లేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంవ్యవహరిస్తోందని వారన్నారు. ఈమేరకు వారు గవర్నర్‌కుమంగళవారం వినతిపత్రసమర్పించారు.
తామునీటి పారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంకాదని, అయితే సాగునీటి ప్రాజెక్టులనుచేపట్టే సమయంలో పునరావాసప్రణాళికను కచ్చితంగా రూపొందించి అమలుచేయడం అవసరమని గవర్నర్‌నుకలిసిన అనంతరం బిజెపి సీనియర్‌నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్‌రావు విలేకరులతో అన్నారు.పునరావాస ప్రణాళిక లేకుండాగిరిజనులను జంతువులను తరిమినట్లుతరమడం సరి కాదని ఆయన అన్నారు.పునరావాస ప్రణాళికను తెప్పించుకొనిగిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని తాముగవర్నర్‌ను కోరినట్లు ఆయనతెలిపారు.












Click it and Unblock the Notifications
