మారుపేర్లతో సూరితో జగన్ ములాఖత్: కోడెల
గుంటూరు:ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడువై.యస్. జగన్మోహన్ రెడ్డి పరిటాలహత్యకేసు సూత్రధారిగాఅనుమానిస్తున్న మద్దెలచెర్వుసూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరినిజైలులో ఎన్ని సార్లు మారు పేర్లతో కలిశాడోరికార్డులు వెలికి తీయాలని మాజీ హోం మంత్రి,తెలుగుదేశం నాయకుడు డాక్టర్‌కోడెల శివప్రసాద్ రావు డిమాండ్‌చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానేతనను పరిటాల హత్య కేసులో ఇరికించేప్రయత్నం చేస్తున్నారని ఆయనవిమర్శించారు.
పరిటాలహత్య కేసులో ప్రధాన నిందితుడుజూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దుశ్రీనుకు కోడెల శివప్రసాదరావుతోసంబంధాలున్నాయని జగన్మోహన్ రెడ్డిఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిఆరోపణలను శివప్రసాదరావుమంగళవారం విలేకరులసమావేశంలో తిప్పికొట్టారు. శ్రీను ఎవరోతనకు తెలియదని తాను ఇప్పటికేస్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.పోలీసుల సమక్షంలోనే మొద్దు శ్రీనుఇంటర్వ్యూను టీవీ ఛానల్‌కు ఇప్పించిఉంటారని ఆయన అనుమానం వ్యక్తంచేశారు.
వైయస్‌కుమారుడు జగన్మోహన్ రెడ్డిగ్యాంబ్లర్‌లాగా తయారయ్యారనిఆయన ఆరోపించారు. జగన్‌సంఘవ్యతిరేక కార్యకలాపాలకు,దుర్మార్గాలకు పాల్పడుతున్నారనిఆయన అన్నారు. జగన్‌ను మంత్రులు,పోలీసు ఉన్నతాధికారులు సంప్రదించేపరిస్థితి ఉన్నదని ఆయన అన్నారు. అధికరక్షణ కావాల్సిన వారి పేరులో తనదిమొట్టమొదట ఉన్నదని ఆయనచెప్పారు.












Click it and Unblock the Notifications
