కోలాముడుపులపై బాబు జవాబు చెప్పాలి: సియల్పీ
హైదరాబాద్:యూరో లాటరీ మోసగాడు కోలాకృష్ణమోహన్ చేసిన ఆరోపణపైవివరణ ఇవ్వాలని కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ (సియల్‌పి) తెలుగుదేశంఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని,బిజెపి నాయకుడు బండారుదత్తాత్రేయను డిమాండ్ చేసింది.బందరు టికెట్ ఇస్తానంటే తానుచంద్రబాబుకు కోటి రూపాయలు ఇచ్చాననికోలా కృష్ణమోహన్ చెప్పాడని, బండారుదత్తాత్రేయకు ముప్పై లక్షలు ఇచ్చాననికోలా కృష్ణమోహన్ చెప్పినట్లుసియల్‌పి ప్రతినిధులు వి.వసంత్‌కుమార్, తదితరులుమంగళవారం విలేకరులసమావేశంలో చెప్పారు. లక్షరూపాయలు తీసుకున్న బంగారులక్ష్మణ్‌పై చర్య తీసుకున్న బిజెపినాయకత్వం ముప్పై లక్షల రూపాయలుతీసుకున్న దత్తాత్రేయపై ఏం చర్యలుతీసుకుంటుందని వారు ప్రశ్నించారు. కోలాచేసిన ఆరోపణలు పత్రికల్లో కూడా వచ్చాయి.
తనపైకోలా కృష్ణమోహన్ ఆరోపణల్లో ఏ మాత్రంనిజం లేదని బిజెపి నాయకుడు బండారుదత్తాత్రేయ స్పష్టం చేశారు. కోలాకృష్ణమోహన్ తనపై ఆరోపణచేయడం వెనక కుట్ర ఉందని ఆయనవిశాఖపట్నంలో విలేకరుల సమావేశంలోఅన్నారు. ప్రతిపక్షాలపై బురద చల్లడానికే ఆవిధమైన ఆరోపణలు వచ్చాయని, టిడిపి,బిజెపి నాయకులపై ఆరోపణలు చేయడమేదానికి నిదర్శనమని ఆయన అన్నారు.తాను హైదరాబాద్‌లో న్యాయవాదినిసంప్రదించి పరువు నష్టం దావా వేసేఆలోచన చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
