హైదరాబాద్‌లోపివి స్మారక కేంద్రం: వైయస్‌

హైదరాబాద్‌:మాజీ ప్రధాని, మాజీ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు స్మారక కేంద్రాన్నిహైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. పి.వి.మృతికి రాష్ట్ర శాసనసభమంగళవారం సంతాపం ప్రకటిస్తూతీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానాన్నిముఖ్యమంత్రి ప్రతిపాదించారు.

సంస్కరణలకుపి.వి. ఆద్యుడని ఆయన అన్నారు. అరుదైననాయకుడు, బహుముఖీన ప్రతిభగలవారు పివి అని ఆయన అన్నారు. ఢిల్లీలోకూడా పివి స్మారక కేంద్రాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదనిప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు అన్నారు.సంస్కరణలకు ఆద్యుడైన పివి దేశభవిష్యత్తుకు బాటలు వేశారని ఆయనఅన్నారు. ఆర్థిక రంగానికి బలాన్నిచేకూర్చారని వివిధ పార్టీల శాసనసభ్యులుప్రశంసించారు. పివి ప్రవేశపెట్టినభూసంస్కరణలు మరువలేనివనివారన్నారు.

పివిఎప్పుడూ కూడా ముస్లింలనువ్యతిరేకించలేదని తెలుగుదేశంసీనియర్‌ శాసససభ్యుడు చెన్నమనేనిరాజేశ్వరరావు అన్నారు. ఫ్యూడల్‌దొరలను ఎదిరించారే తప్ప ముస్లింలనుఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయనఅన్నారు. బాబ్రీ మసీదు విషయంలోసాధువులు, సంతులు ఇచ్చిన హామీని పివివిశ్వసించారని, అయితే వారు ఆ హామీనినిలబెట్టుకోలేదని ఆయన అన్నారు.

ఆర్థికమంత్రి కె. రోశయ్య, నోములనర్సింహయ్య (సిపియం), చాడవెంకటరెడ్డి (సిపిఐ), జి. కిషన్‌ రెడ్డితదితరులు పివికి నివాళులర్పించారు.

సునామీమృతులకు సంతాపం ప్రకటిస్తూశాసనసభ మరో తీర్మానాన్ని ఆమోదించింది.సునామీ బాధితులను ఆదుకోవడంలోప్రభుత్వం సమర్థంగా పని చేసిందనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. సునామీ తాకిడినిముందుగా పసిగట్టలేకపోయినా అదిసంభవించిన వెంటనే తగిన చర్యలుతీసుకోవడంలో ప్రభుత్వం చురుకుగాపని చేసిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+