మరోపన్నెండు మంది నక్సల్స్ లొంగుబాటు
హైదరాబాద్:రాష్ట్రంలో నక్సలైట్ల లొంగుబాట్ల పర్వంకొనసాగుతోంది. తాజాగా మంగళవారంరాష్ట్రంలో పన్నెండు మంది నక్సలైట్లులొంగిపోయారు. అనంతపురం జిల్లా పోలీసుసూపరింటిండెంట్ ప్రవీణ్‌కుమార్‌ముందు పదకొండు మంది సిపిఐ(మావోయిస్టు) నక్సలైట్లులొంగిపోయారు.
అనంతపురంఎస్పీ ముందు లొంగిపోయిన నక్సలైట్లుమావోయిస్టు పెన్నా అహోబిలం, పెనుకొండదళాలకు చెందినవారు. వీరిలో ఇద్దరుమైనర్ బాలికలు కూడా ఉన్నారు. వీరువివిధ చట్టవ్యతిరేక కార్యకలాపాల్లోపొల్గొన్నట్లు ఎస్పీ చెప్పారు. ఆర్థికస్థితిగతులు బాగా లేనందున, కుటుంబపరిస్థితుల వల్ల తాము లొంగిపోతున్నట్లుచెప్పారు.
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లా గోదావరిఖనిఅదనపు పోలీసు సూపరింటిండెంట్‌ముందు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) సభ్యుడు రాజయ్యలొంగిపోయాడు.












Click it and Unblock the Notifications
