అసెంబ్లీస్తంభన: రేపటికి వాయిదా
హైదరాబాద్:కార్యక్రమాలేవీ చేపట్టకుండానేశాసనసభ రేపటికి(గురువారంనాటికి) వాయిదా పడింది.తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపైతక్షణమే చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలుడిమాండ్ చేశాయి. ప్రతిపక్షాలువేర్వేరు వాయిదా తీర్మానాలుప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ కె. ఆర్.సురేష్ రెడ్డి తోసిపుచ్చారు. అయినాప్రతిపక్షాలు తమ పట్టు వీడలేదు.తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చచేపట్టాల్సిందేనని అవి పట్టుబట్టాయి. స్పీకర్‌పోడిమం వద్దకు ప్రతిపక్షాల సభ్యులుదూసుకెళ్లి నినాదాలు చేశారు.
మొదటపదిహేను నిమిషాల పాటు స్పీకర్ సభనువాయిదా వేశారు. సలహా సంప్రదింపులకమిటీ సమావేశంలో స్పీకర్‌ప్రతిపక్షాలతో చర్చించారు. ఆ తర్వాతసభ అరగంటకు తిరిగి సమావేశమైంది.అయినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులుతమ పట్టు వీడలేదు. స్పీకర్‌పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలుచేశారు. దీంతో స్పీకర్ సభనురేపటికి వాయిదా వేశారు. శాసనసభకార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి అన్నిటీవీ ఛానళ్లకు అనుమతి ఇవ్వాలనిప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.ప్రభుత్వం తమ గొంతు నొక్కేప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలువిమర్శించాయి.












Click it and Unblock the Notifications
