నారాయణరెడ్డికివైద్య పరీక్షలు: సీల్డ్ కవర్‌లోనివేదిక
అనంతపురం:తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవి హత్య కేసులో నిందితుడునారాయణ రెడ్డికి అయిన గాయానికివైద్య పరీక్షలు జరిగాయి. పరిటాల హత్యసమయంలో కాల్పుల్లో నారాయణ రెడ్డికడుపులో గాయమైందనిచెబుతున్నారు. దాన్నిధృవీకరించుకోవడానికి కేంద్రదర్యాపుత సంస్థ (సిబిఐ) నారాయణరెడ్డి గాయానికి వైద్య పరీక్షలుచేయించింది. రెండు గంటల పాటు వైద్యులుపరీక్షలు జరిపారు. సీల్డ్ కవర్‌లోవైద్య పరీక్షల నిర్ధారణలనువైద్యులు జైలు అధికారులకుఅందించారు.
నారాయణరెడ్డి గాయానికి సంబంధించి సరైననిర్ధారణకు రావడం ఇబ్బందేననివైద్యులంటున్నారు. గాయం జరిగి చాలారోజులైనందున కచ్చితమైననిర్ధారణకు రావడం కష్టంగానేఉంటుందని వారంటున్నారు. గాయం ఎలా జరిగింది,ఎప్పుడు జరింది అనే విషయాలను తాముతేల్చాల్సి ఉంటుందని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
