సిసిఐ ద్వారాపత్తి కొనుగోళ్లు: కేంద్రం హామీ
హైదరాబాద్:రాష్ట్రంలోని నాసిరకం పత్తిని భారతకాటన్ కార్పోరేషన్ (సిసిఐ) ద్వారాకొనుగోలు చేయిస్తామని కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి హామీఇచ్చారు. రాష్ట్రంలోని పత్తి కొనుగోళ్లవిషయమై ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి బుధవారంటెలిఫోన్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రిశరద్‌పవార్‌తో మాట్లాడారు. పత్తికొనుగోలుకు సిసిఐని రంగంలోకిదింపుతామని శరద్ పవార్‌వైయస్‌కు హామీ ఇచ్చినట్లు రాష్ట్రసహకార మంత్రి కన్నా లక్ష్మినారాయణవిలేకరులతో చెప్పారు.
సీజన్‌చివరలో వచ్చిన నాసిరకం పత్తినికొనడానికి వ్యాపారులు ముందుకురావడం లేదు. దీంతో ఈ పత్తికొనుగోలుకు రైతులు కొంత కాలంగాప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మిర్చికొనుగోలుకు కూడా మార్క్‌ఫెడ్‌ను,నాఫెడ్‌ను రంగంలోకి దించే విషయాన్నికూడా పరిశీలిస్తామని శరద్‌పవార్ హామీఇచ్చినట్లు మంత్రి తెలిపారు. చెరుకుకొనుగోలుపై మాట్లాడేందుకు ఇరవైఒకటి తర్వాత ఢిల్లీకి రావాల్సిందిగాశరద్‌పవార్ సూచించినట్లు పర్యాటకమంత్రి జె. గీతారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications
