ప్రత్యక్షప్రసారాలు ఉండాల్సిందే: ప్రతిపక్షాలు
హైదరాబాద్:అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్షప్రాసారాలనుపునరుద్ధరించాల్సిందేనని, అన్ని టీవీఛానళ్ల కెమెరాలను అసెంబ్లీకార్యక్రమాల కవరేజీకిఅనుమతించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌చేశాయి. ఒక ప్రైవేట్ ఏజెన్సీ కెమెరానుమాత్రమే అనుమతించి, అది ఇచ్చేవాటిపైనేటీవీ ఛానళ్లు ఆధారపడే పద్ధతినిప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ మిత్రపక్షాలువామపక్షాలు కూడా వ్యతిరేకించాయి.
అసెంబ్లీలోఅనేక పరిమాణాలు సంబవిస్తున్నాయని,ప్రభుత్వం అనుమతించిన ఏజెన్సీకెమెరా వాటిని సరిగా చూపడం లేదనివీరభద్రం (సిపియం) విలేకరులతోఅన్నారు. కనీసం మూడు కెమెరాలనన్నాఅనుమతించాలని ఆయనఅభిప్రాయపడ్డారు.
ప్రైవేట్‌ఏజెన్సీ సరైన వాటిని ప్రసారాలకుఅందించడం లేదని, గత పద్ధతినిపునరుద్ధరించడం అవసరమని జి.కిషన్ రెడ్డి (బిజెపి) అన్నారు. ప్రైవేట్‌ఏజెన్సీ ద్వారా సరైన వార్తలు వెళ్లడంలేదని ఆయన అన్నారు.
అసెంబ్లీకార్యక్రమాలు అన్నీ ప్రజలకు చేరాల్సినఅవసరం ఉన్నదని, శాసనసభాకార్యక్రమాలను తెలుసుకోవడం ప్రజలహక్కు అని, ప్రభుత్వం ఆ హక్కునుకాలరాస్తోందని టి. దేవేందర్ గౌడ్(టిడిపి) అన్నారు. ప్రభుత్వానికి ఇష్టమైనవార్తలనే ప్రైవేట్ ఏజెన్సీ అందిస్తోందనిఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
