బాబు వాకౌట్:ప్రజాస్వామ్యం ఖూనీ అని వ్యాఖ్య
హైదరాబాద్:శాసనసభ నుంచి తమ సభ్యులనుసస్పెండ్ చేసినందుకు నిరసనగాప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశంపార్టీ నాయకుడు సభ నుంచి వాకౌట్‌చేశారు. తమ సభ్యులను సస్పెండ్‌చేసిన అనంతరం ఆయన తీవ్రంగాప్రతిస్పందిస్తూ నన్ను కూడా బయటకుపంపేయండంటూ వాకౌట్ చేశారు.
శాసనసభలోప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయనకాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.బయట తమ పార్టీ నేతలను,కార్యకర్తలను హత్య చేస్తున్నారని,సభ లోపల నోరు నొక్కేస్తున్నారని ఆయనఅన్నారు. చంద్రబాబుమాట్లాడుతున్నంత సేపు కాంగ్రెస్‌సభ్యులు అభ్యంతరం తెలియజేస్తూగొడవ చేశారు. నాగం జనార్దన్ రెడ్డినిసస్పెండ్ చేసనప్పుడు తానుమాట్లాడడానికి ప్రయత్నించానని,అనంతరం సభ వాయిదా పడి తిరిగిసమావేశమైన తర్వాతమాట్లాడటానికి అవకాశం ఇవ్వాలనిఅడిగానని, తనకు మాట్లాడే అవకాశంఇవ్వలేదని ఆయన చెప్పారు. స్పీకర్‌తన నోరు నొక్కేస్తున్నారని ఆయనవిమర్శించారు.
ఫ్లోర్‌లీడర్ల అభిప్రాయాలు తెలుసుకోకుండా, నాగంజనార్దన్ రెడ్డి ఏ విధమైనపార్లమెంటరీ వ్యతిరేక పదజాలం వాడారోచెప్పకుండా సస్పెండ్ చేశారని ఆయనతప్పు పట్టారు. మీ బెదిరింపులకుభయపడేది లేదు అని చంద్రబాబు తనప్రసంగానికి అడ్డు తగులుతున్నకాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి అన్నారు. ఈసభ ముఠా నాయకుడి నాయకత్వంలోనడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.తాను వైయస్, రోశయ్యలదయాదాక్షిణ్యాల మీద ఈ సభకు ఎన్నికకాలేదని ఆయన అన్నారు.శాసనసభ్యుడైన రవి హత్య జరిగితేస్పీకర్ ఆ కుటుంబాన్నిపరామర్శించకపోవడం మంచిది కాదనిఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
