వైయస్‌కుముఠాలపై, హత్యలపై నమ్మకం: బాబు
హైదరాబాద్:ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికిప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని,రాజశేఖర్ రెడ్డికి ముఠాలపై,హత్యలపై విశ్వాసం ఉన్నదని ప్రతిపక్షనాయకుడు, తెలుగుదేశంఅధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడువ్యాఖ్యానించారు. పోలీసులతో కుమ్మక్కయిప్రభుత్వం తమ నాయకులను,కార్యకర్తలను హత్యచేయిస్తోందని, ఇవి సర్కార్ హత్యలనిఆయన అన్నారు. తెలుగుదేశంశాసనసభ్యుల ధర్నా కార్యక్రమంవద్ద ఆయన విలేకరులతోమాట్లాడారు. తమకు రక్షణ లేదనిఆయన అన్నారు. ఈ రాజకీయహత్యలపై తాము ప్రజా పోరాటాలుచేస్తామని, తమ పోరాటం ప్రజాస్వామ్యపద్ధతిలో సాగుతుందని, కాంగ్రెస్‌కుహింసపై నమ్మకం ఉన్నదని,తమకు అహింసపై నమ్మకమనిఆయన అన్నారు.
శాసనసభ్యులప్రాణాలను కాడాల్సిన ముఖ్యమంత్రేప్రోత్సహించి, నాయకత్వం వహించిహత్యలు చేయిస్తున్నారని ఆయనఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలనుఅన్నింటినీ నిర్మూలించేందుకుప్రయత్నిస్తున్నారని ఆయనవిమర్శించారు. అయితే కాంగ్రెస్‌ప్రయత్నాలు ఫలించవని, సర్కార్‌హత్యలను తాము అడ్డుకుంటామనిఆయన చెప్పారు. తమ పార్టీనాయకులను, కార్యకర్తలను 46మందిని హత్య చేశారని ఆయనఅన్నారు.
స్పీకర్‌కె. ఆర్. సురేష్ రెడ్డి తమశాసనసభ్యుడ్ని కాపాడలేకపోయారని,కనీసం ఆ సభ్యుడి కుటుంబ సభ్యులనుపరామర్శించ లేదని, కాంగ్రెస్‌నేతలకు సానుభూతి లేకున్నాఫర్వాలేదని అనుకున్నామని, అయితేస్పీకర్‌కు ఆ సానుభూతి ఉండాలని ఆశించామని,కానీ స్పీకర్‌కు కూడా ఆ సానుభూతిలేదనేది అర్థమైందని ఆయన అన్నారు.పరిటాల రవి హత్య జరిగిన బాధనుఅణచుకొని గవర్నర్ ప్రసంగానికి,బడ్జెట్ ప్రతిపాదనకు తాముసహకరించామని, అయితే పరిటాలహత్యపై చర్చకు రాకుండా కాంగ్రెస్‌ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. పరిటాలరవి హత్యకు చంపించిన వ్యక్తేసంతాప తీర్మానం ప్రతిపాదిస్తేసహకరించాలా వద్దా అని తాముఆలోచించుకున్నామని, అయితే వ్యక్తికికాకుండా ముఖ్యమంత్రి పదవికి గౌరవంఇచ్చి సహకరించామని ఆయన చెప్పారు.
పరిటాలరవికి భద్రత కల్పించాలని తామురాష్ట్రపతికి, ప్రధానికి, గవర్నర్‌కువిజ్ఞప్తి చేశామని, అయినా ఫలితంలేకపోయిందని ఆయన చెప్పారు.రాయలసీమ ఐజిగా మీనాను వేసినప్పుడేవద్దని చెప్పామని, మీనాపై తమప్రభుత్వ హయాంలో ఆరోపణలు వచ్చాయని,దాంతో సస్పెండ్ చేశామని, కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చిన తర్వాతప్రమోషన్ ఇచ్చి రాయలసీమ ఐజిగా వేసిమీనాకు ఎజెండా ఇచ్చారని ఆయన అన్నారు.ఎవరెవరిని ఎప్పుడు చంపాలో మీనాకుచెప్పారని ఆయన ఆరోపించారు. పరిటాలకుముసలివాళ్లను సెక్యూరిటీ గార్డులుగాఇచ్చారని, ఒక పద్ధతి ప్రకారం రవినిహత్య చేయించారని ఆయన అన్నారు.బ్లూఫాక్స్‌ను తమవారిని చంపడానికేఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు.
రవిహత్య కేసుకు సంబంధించి ఎఫ్ ఐ ఆర్‌లోమీనా, మంత్రి జెసి దివాకర్ రెడ్డి,వైయస్ పుత్రుడు వైయస్‌జగన్మోహన్ రెడ్డి పేర్లు ఉన్నాయని, వారినిఅరెస్టు చేయలేదని, ప్రశ్నించలేదనిఆయన అన్నారు. వైయస్ మూడుతరాల చరిత్ర కూడానేరమయమేనని చంద్రబాబుఆరోపించారు. పులివెందులలో నడిబజారులోవైయస్ తండ్రి మనుషులనుతగులబెట్టించారని, బెరైటీస్‌పైఆధిపత్యం కోసం వెంకటనర్సయ్యనుచంపాడని, తద్వారా బెరైటీస్‌పైఆధిపత్యం సంపాదించి డబ్బులుసంపాదించారని, దాన్ని సుస్థిరంచేసుకోవడానికి హత్యలు చేస్తున్నారనిఆయన అన్నారు.
పరిటాలహత్య కేసులో అసలు దోషులనురక్షించడానికి నిందితుల లొంగుబాటుడ్రామా సాగుతోందని చంద్రబాబువ్యాఖ్యానించారు. జైళ్లో సెల్‌ఫోన్లుఇతరత్రా ఇష్టారాజ్యంగావ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.తమను చూసి ప్రభుత్వంభయపడుతోందని, తమను బయటకుపంపి సభను నడిపించాలనిఅనుకుంటోందని, అందుకే సస్పెండ్‌చేశారని, ప్రధాన ప్రతిపక్షం లేని సభసభే కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
