వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుమైండ్‌సెట్‌ ఇంకా మారలేదు:వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మైండ్‌ సెట్‌ ఇంకామారలేదని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డివ్యాఖ్యానించారు. మంగళవారంతెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్‌అనంతరం ఆయన శాసనసభలోమాట్లాడారు. సంస్కరణలకు మానవముఖాన్ని జత చేయడం మాని చంద్రబాబుప్రభుత్వం గ్లోబలైజేషన్‌ మాయలోపడి కార్మికులను రోడ్డున పడేసిందని,వ్యవసాయం దండుగని చెప్పివ్యవసాయ రంగాన్నిపట్టించుకోలేదని, దీని వల్ల రాష్ట్రంపూర్తిగా దివాళా చేసిందని ఆయన అన్నారు.ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పర్యాటకరంగాల వల్లనే ఉపాధి లభిస్తుందంటూవ్యవసాయ రంగాన్ని చంద్రబాబువిస్మరించారని ఆయన విమర్శించారు.వ్యవసాయ రంగానికి ప్రాధాన్యంఇస్తేనే ప్రజల కొనుగోలు శక్తి పెరిగిపారిశ్రామికాభివృద్ధి జరగుతుందనేవిషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదనిఆయన అన్నారు.

చైనానుంచి చంద్రబాబు ఏం నేర్చుకొచ్చారోతెలియదని, చైనా పర్యటించి వచ్చినతర్వాత కూడా చంద్రబాబు వైఖరిమారలేదని ఆయన అన్నారు. చైనావ్యవసాయానికి, అందుకుఅవసరమైన సాగునీటికి ప్రాధాన్యంఇస్తోందని, అదే పద్ధతిలో రాష్ట్రాన్నిముందుకు నడిపించడానికి తాముప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.తాము రాష్ట్రం దశను మార్చడానికిదిశను స్పష్టంగా నిర్దేశించుకునిగవర్నర్‌ ప్రసంగంలో తెలిపామనిఆయన చెప్పారు. తెలుగుదేశంప్రభుత్వ హయాంలో వ్యవసాయందండుగని అప్పటి ముఖ్యమంత్రిచంద్రబాబు అన్నారని, రైతులు పిచ్చి పట్టిఆత్మహత్యలు చేసుకుంటున్నారని అప్పటిమంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి, తిన్నదిఅరగక రైతులు ఆత్మహత్యలుచేసుకుంటున్నారని టిడపిమిత్రపక్షమైన బిజెపి నాయకుడుబండారు దత్తాత్రేయ అన్నారని, దీన్ని బట్టిరైతుల పట్ల వారికున్న శ్రద్ధ ఏమిటోఅర్థం చేసుకోవచ్చునని ఆయనఅన్నారు.

తెలుగుదేశంప్రభుత్వ హయాంలో ఛిన్నాభిన్నమైనఆర్థిక వ్యవస్థను పట్టాలపై పెట్టడానికిప్రయత్నిస్తున్నామని, దానికి తొమ్మిది నెలలుసరిపోదని, ఇంకా ప్రయత్నిస్తున్నామని,అందుకు సమయం పడుతుందనిఆయన అన్నారు. తొమ్మిదేళ్లలోఅస్తవ్యవస్థం చేసిన రాష్ట్ర పరిస్థితినితొమ్మిది నెలల్లో సరిదిద్దడం ఎలాసాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు.ప్రభుత్వ ఆస్తులను, కంపెనీలను తనహయాంలో తెలుగుదేశం అమ్ముకుందనిఆయన అన్నారు. బ్రహ్మానందరెడ్డికట్టించిన ముఖ్యమంత్రి నివాసాన్నిచంద్రబాబు పడగొట్టించారని, అది ఉంటేతాను దాంట్లోనే ఉండేవాడినని,అటువంటివారు తన నివాసంపైవిమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.తన ఇళ్లపై ఒక్క పైస కూడా ఖర్చుపెట్టలేదని ఆయన చెప్పారు.ముఖ్యమంత్రి నివాసం కడుతున్నామనిఆయన చెప్పారు. మొత్తం ఆరు కోట్లతోనివాసం, క్యాంప్‌ ఆఫీసు, భద్రతా ఏర్పాట్లఅమరికలు చేస్తున్నామని ఆయనఅన్నారు.

చంద్రబాబుపాలనలో జరిగిన వ్యవహారాలపై కావాలంటేకమిటీ వేస్తామని, అన్ని రంగాల్లోనూచంద్రబాబు పాలన అన్యాయంగావ్యవహరించిందని తేల్చి చెబుతారనిఆయన అన్నారు. విదేశీ సంస్థలనుక్యాప్‌లకు, జెండాల వంటివాటికిదుబారా చేశారని ఆయన విమర్శించారు.ఫ్లోరోసిస్‌ బాధితులనుపట్టించుకోలేదని ఆయన అన్నారు.

తనప్రభుత్వ హయాంలో సంఘటనలపైహైకోర్టు, సుప్రీంకోర్టు తప్పు పట్టినాచంద్రబాబు పట్టించుకున్నారా అనిరాజశేఖర్‌ రెడ్డి అడిగారు. మాజీ హోంమంత్రి కోడెల శివప్రసాదరావు ఇంట్లోబాంబులు తయారు చేస్తున్నసమయంలో అవి పేలి నలుగురుమరణిస్తే సిబి ఐకి అప్పగించాలంటే బాబువ్యతిరేకించారని, తమ పార్టీనాయకులు కోర్టుకు వెళ్తే సిబి ఐకిఅప్పగించాలని కోర్టు సూచించిందని, అయితేచంద్రబాబు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్నిపట్టుకొని సిబి ఐ దర్యాప్తును ఆపించారనిఆయన వివరించారు.

సాగునీటిటెండర్ల ఖరారులో ప్రభుత్వానికిఅనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాపట్టించుకోకుండా ముడుపులు తిన్నారంటూచంద్రబాబు తమపై విమర్శలుచేస్తున్నారని, చంద్రబాబుతీసుకున్నట్లుగానే తాము ముడుపులుతీసుకుంటున్నామని చంద్రబాబుఅనుకుంటున్నారని ఆయన అన్నారు.పదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనంచేసిన చంద్రబాబుకు తమతొమ్మిదేళ్ల పాలనను విమర్శించేనైతిక హక్కు లేదని ఆయనఅన్నారు.

సాగునీటిరంగంలో, వ్యవసాయంలో, విద్యుచ్ఛక్తిరంగంలో, బలహీన వర్గాల గృహనిర్మాణ రంగంలో ప్రభుత్వంచేపట్టిన, చేపడుతున్నకార్యక్రమాల గురించి ఆయనసోదాహరణంగా సుదీర్ఘంగావివరించారు. పత్రికల్లో రాస్తూరాయిస్తున్నారని ఆయన అన్నారు. తాముపెద్దయెత్తున కార్యక్రమాలుచేపడుతుంటే బురద చల్లేకార్యక్రమాన్ని తెలుగుదేశం చేపట్టిఅడ్డుకునే ప్రయత్నం చేస్తోందనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X