జయేంద్రముందస్తుపై 24న కోర్టు ఆదేశాలు
చెన్నై:మాధవన్‌పై హత్యాయత్నం కేసులోకంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి పెట్టుకున్న ముందస్తుబెయిల్ పిటిషన్‌పై సెషన్స్ కోర్టుతన నిర్ణయాన్ని ఈ నెల 24వ తేదీకివాయిదా వేసింది. మాధవన్‌పై జరిగినదాడి కేసులో తనను అరెస్టు పోలీసులుచేసే అవకాశాలు ఉండటంతో జయేంద్రసరస్వతి ముందస్తు బెయిల్‌పిటిషన్‌ను దాఖలు చేశారు.
శంకరాచార్యతరఫు న్యాయవాది ఎస్. యస్.దినకర్, బెయిల్‌ను వ్యతిరేకించినపబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. దురైస్వామిలవాదోపవాదాలు విన్న తర్వాత ప్రిన్సిపల్‌సెషన్స్ జడ్జి పి. మురుగేషన్ తనఆదేశాలను రిజర్వ్ చేసుకున్నారు.చెన్నైలోని తిరుకోష్తియూర్ దేవాలయపూజారి మాధవన్‌పై ఆగస్టు 3వ తేదీనదాడి జరిగింది.












Click it and Unblock the Notifications
