వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ నుంచి28 మంది టిడిపి సభ్యుల గెంటివేత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను 28మందిని స్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌ రెడ్డిమార్షల్స్‌ చేత అసెంబ్లీ నుంచిగెంటివేయించారు. అంతకు ముందుతెలుగుదేశం సభ్యులను 28 మందినిస్పీకర్‌ పది రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వారుసభ నుంచి బయటకువెళ్లకపోవడంతో మార్షల్స్‌ చేతబయటకు గెంటి వేయించారు.

మంగళవారంసభ సమావేశం కాగానేతెలుగుదేశం సభ్యులు తాము ఇచ్చినవాయిదా తీర్మానంపై చర్చకు వెంటనేఅనుమతించాలని కోరారు. తమ పార్టీశాసససభ్యుడు పరిటాల రవిహత్యోందంపై తక్షణమే చర్చకుఅనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు.అందుకు స్పీకర్‌ అనుమతించలేదు.అయినప్పటికీ తెలుగుదేశం సభ్యులుతమ పట్టు వీడలేదు. ఈ సమయంలోఅధికార కాంగ్రెస్‌ సభ్యులకు, ప్రతిపక్షతెలుగుదేశం సభ్యులకు మధ్యతీవ్ర వాగ్వివాదం జరిగింది. స్పీకర్‌ నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ 28 మంది తెలుగుదేశంసభ్యులు వ్యతిరేకిస్తూ పోడియాన్నిచుట్టుముట్టారు. దీంతో సభా కార్యక్రమాలుస్తంభించాయి. స్పీకర్‌ ఎంత చెప్పినావారు వినలేదు. తనపై టిడిపిసభ్యులు వ్యాఖ్యలు చేశారు.

పరిటాలహత్యోదంతంపై తాము ఇచ్చిన వాయిదాతీర్మానాన్ని అనుమతించి వెంటనే చర్చనుచేపట్టాలని తెలుగుదేశం సభ్యులుపట్టుబట్టిన సమయంలో శాసనసభావ్యవహారాల మంత్రి కె. రోశయ్యతెలుగుదేశం శాసనసభా పక్షం ఉపనాయకుడు డాక్టర్‌ నాగం జనార్దన్‌రెడ్డి సస్పెన్షన్‌కు తీర్మానంప్రతిపాదించారు. నాగం జనార్దన్‌ రెడ్డిపార్లమెంటరీ వ్యతిరేక వ్యాఖ్యలుచేసినందుకు సభ నుంచి సస్పెండ్‌చేయాలని రోశయ్య ప్రతిపాదించారు. దీంతోనాగం జనార్దన్‌ రెడ్డిని పది రోజుల పాటు సభనుంచి స్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌ రెడ్డిసస్పెండ్‌ చేశారు. దాంతోతెలుగుదేశం సభ్యుల నుంచి తీవ్రఅభ్యంతరం వ్యక్తం కావడంతోసభను స్పీకర్‌ పదిహేను నిమిషాల పాటువాయిదా వేశారు. తిరిగి సమావేశమైనతర్వాత కూడా సభసద్దుమణగకపోవడంతో స్పీకర్‌ 28ంమది తెలుగుదేశం సభ్యులను పదిరోజుల పాటు సభ నుంచి సస్పెండ్‌చేస్తున్నట్లు ప్రకటించారు.

సమావేశంనుంచి బయటకు వచ్చిన అనంతరంటిడిపి సభ్యులుఅసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహంవద్ద ప్రదర్శనకు దిగారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X