వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాలహత్యపై అసెంబ్లీలో దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవీంద్ర హత్యోదంతంపైబుధవారం శాసనసభలో దుమారంచెలరేగింది. బుధవారం సభసమావేశం కాగానే పరిటాల హత్యపైచర్చను చేపట్టాలని తెలుగుదేశం పార్టీపట్టుబట్టింది. ఆ తర్వాత పరిటాల హత్యపై304 నిబంధన కింద చర్చకు స్పీకర్‌కె. ఆర్‌. సురేష్‌ రెడ్డిఅనుమతించారు.

చర్చనుతెలుగుదేశం సభ్యుడు టి.దేవేందర్‌ గౌడ్‌ ప్రారంభించారు. పరిటాలహత్యపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని ఆయనడిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లోపేరున్న జె.సి. దివాకర్‌ రెడ్డినిమంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయనముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డివి డిమాండ్‌ చేశారు.ఎఫ్‌ ఐ ఆర్‌లో పేర్లున్నవారిని పోలీసులుఎందుకు ప్రశ్నించలేదని ఆయనఅడిగారు. ఒక పథకం ప్రకారం పరిటాలరవిని హత్య చేశారని ఆయనఆరోపించారు.

నిందితులుఒక్కరొక్కరే లొంగిపోవడం చూస్తే పరిస్థితిఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయనఅన్నారు. పరిటాలను తానే హత్య చేశాననిఒక ప్రైవేట్‌ టీవీ ఛానల్‌కుఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి తానింకా ఇద్దరినిచంపుతానని, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడును చంపడానికితనకు కష్టం కాదని అన్నాడని, ఆవ్యక్తిని పోలీసులు పట్టుకోలేకపోయారనిఆయన అన్నారు. ఈ సమయంలోదేవేందర్‌ గౌడ్‌ ప్రసంగానికి అధికారకాంగ్రెస్‌ పార్టీ సభ్యులు అడుగడుగునాఅడ్డం తగిలారు.

అనంతరంచర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ సభ్యుడుకిరణ్‌కుమార్‌ రెడ్డితెలుగుదేశం అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలుచేశారు. మాజీ హోం మంత్రి కోడెలశివప్రసాద్‌ రావు, మాజీ మంత్రి సి.కృష్ణా యాదవ్‌, తదితరులపైతెలుగుదేశం ప్రభుత్వ హయాంలోకేసులు ఎత్తివేసిన విషయాలను ఆయనఎత్తిచూపారు. తెలుగుదేశం ప్రభుత్వహయాంలో రెండు వేలకు పైగా కేసులుఉపసంహరించుకున్నారని ఆయనచెప్పారు. మాజీ హోం మంత్రి ఎలిమినేటిమాధవరెడ్డి ప్రాణాలనుకాపాడలేకపోయారని ఆయన అన్నారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోజరిగిన ప్రధాన హత్యలను ఆయనఉటంకించారు. పరిటాల రవి హత్యనుఆయన ఖండించారు. పరిటాలను హత్యచేసివవారికి కఠినమైన శిక్ష పడాలనితాను కోరుకుంటున్నానని ఆయనచెప్పారు.

పరిటాలహత్యను రాజకీయం చేయడంతగదని సిపియం సభ్యుడు గఫూర్‌అన్నారు. ఫ్యాక్షన్‌ హత్య పరంపరలోభాగంగా పరిటాల రవి హత్య జరిగిందనిఆయన అన్నారు. రాజకీయాలకుఫ్యాక్షనిజాన్ని దూరం చేయాల్సినఅవసరం ఉన్నదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X