ఆయుధాలపైఅసెంబ్లీలో చర్చించాలి: కళ్యాణ్ డిమాండ్
హైదరాబాద్:ఆయుధాలపై శాసనసభలో చర్చచేపట్టాలని సిపిఐ (మావోయిస్టు) ప్రతినిధి జి.కళ్యాణ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఆయుధాలపై అసెంబ్లీలో చర్చచేపడితే ప్రతిపక్షాలు ఏమంటాయోప్రభుత్వానికి అర్థమవుతుందనిఆయన బుధవారం విలేకరులతోఅన్నారు.
మొదటిదఫా చర్చల సందర్భంలో ఆయుధాలప్రసక్తి లేనప్పుడు ఇప్పుడెందుకనిఆయన అడిగారు. మొదటి దఫా చర్చలసమయంలో నెలకొన్నటువంటివాతావరణం నెలకొంటేనే రెండో దశచర్చలు సాధ్యమవుతాయని ఆయనఅన్నారు. నక్సలైట్ల వ్యక్తిగతసమస్యలను కూడా తీరుస్తామనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి అనడాన్ని ఆయనతీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రిఆ విధంగా అనడం అనడం ద్వారానక్సలైట్లను అవమానిస్తున్నారనిఆయన అన్నారు. నక్సలైట్లు ఎప్పుడూవ్యక్తిగత సమస్యలనుప్రస్తావించలేదని, కనీసం తమపైఉన్న కేసుల గురించి కూడా మాట్లాడలేదనిఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
